Raj Tharun | టాలీవుడ్ యువ నటుడు రాజ్‌తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తుండగా.. ‘యజ్ఞం’, ‘వీరభద్ర’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాల ఫేమ్ రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
తెలుగు ప్రేక్షకులందరికీ 2024 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు✨️
Romantic Entertainer #TiragabadaraSaami grand release in theatres on FEB 23rd😍
⭐ing @itsRajTarun @MalviMalhotra
A #ASRavikumarChowdhary Film #MalkapuramShivakumar #JB #SurakshEntertainments… pic.twitter.com/MF7U7Yvfx0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2024
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో తన లక్ష్యం కోసం ఎంతటివారినైనా ఎదిరించే ఓ యువకుడి కథ ఇది అని దర్శకుడు వెల్లడించాడు. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్ విజయ్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేబీ సంగీతం అందిస్తున్నాడు.