Tiger-3 Movie | టైగర్-3 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Tiger-3 Movie | వారం రోజుల కిందట రిలీజైన టైగర్-3 గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరాడం, అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేసింది.
Tiger-3 Movie | వారం రోజుల కిందట రిలీజైన టైగర్-3 గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరాడం, అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేసింది. ఈ సారి ఒక్క యాక్షన్ మాత్రమే కాదు.. స్టోరీ కూడా సర్ప్రైజింగ్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కాగా తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి డేట్‌ను లాక్ చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
‘TIGER 3’ TRAILER ON 16 OCT, MONDAY… ARE YOU READY???#Tiger3 #SalmanKhan #KatrinaKaif #YRFSpyUniverse #ManeeshSharma #Diwali2023 pic.twitter.com/rLCQXOPiIc
— taran adarsh (@taran_adarsh) October 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

