Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3. టైగర్ ప్రాంఛైజీలో సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేకే ప్రభుకా నామ్ (Leke Prabhu Ka Naam) సాంగ్‌ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ టైం కూడా ప్రకటించారు. అక్టోబర్ 23 ఉదయం 11 గంటలకు లేకే ప్రభుకా నామ్ విడుదల అవుతుందంటూ చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే వదిలిన ఈ సాంగ్ టీజర్‌ను చూస్తే.. ఫుల్ పార్టీ మోడ్ సాంగ్లా ఉంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది.
Tiger + Zoya = Mazzedaar Party!💃🕺#LekePrabhuKaNaam song drops tomorrow at 11 AM
Hindi: https://t.co/QsSZ9WYudy
Tamil: https://t.co/EPkQZIazk7
Telugu: https://t.co/Hj3zHC2n4n#Tiger3 arriving in cinemas on 12th November. Releasing in Hindi, Tamil & Telugu.#KatrinaKaif |… pic.twitter.com/bmbqUzt9Pj— Salman Khan (@BeingSalmanKhan) October 22, 2023
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.