Tiger-3 Movie | సల్మాన్ ఖాన్ కొత్త సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్..!
Tiger-3 Movie | మూడు రోజులు ముందు రిలీజైన టైగర్-3 ట్రైలర్ హిందీ ప్రేక్షకులనే కాదు తెలుగు ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే..
Tiger-3 Movie | మూడు రోజులు ముందు రిలీజైన టైగర్-3 ట్రైలర్ హిందీ ప్రేక్షకులనే కాదు తెలుగు ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరాడం, అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం వంటివి ఆడియెన్స్‌లో ఉత్కంఠ రేకెత్తించాయి. దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. లేకు ప్రభు కా నామ్ అంటూ సాగే ఓ మాస్ బీట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను అక్టోబర్ 23కు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తెలుగులో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పైగా పటాన్, జవాన్ వంటి సినిమాలను తెలుగు ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి.. టైగర్-3 మేకర్స్ కూడా డబ్బింగ్‌ను పర్ఫెక్ట్గా చేయించేలా ప్లాన్ చేస్తుంది. రిలీజ్‌కు ఎలాగో ఇంకొ నెల టైమ్ ఉంది గనుక.. తెలుగు, తమిళ భాషల్లో ప్రమోషన్లు కూడా భారీగా చేయాలని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్లాన్ చేస్తుందట.
టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి డేట్‌ను లాక్ చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

