Thunivu Movie | తునివు మూవీ అప్డేట్లు షురూ.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట..!
తమిళ హీరో అజిత్ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన తునివు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thunivu Movie First Single | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లు ప్రకటించడం లేదు.
దీనిపై అజిత్ ఫ్యాన్స్ తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ఎట్టకేలకు అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. చిల్లా చిల్లా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ గీతాన్ని అనిరుధ్ ఆలపించగా జీబ్రాన్ స్వర పరిచాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన అజిత్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్రబృందం తెలుగు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

