MEGA 157 | బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే MEGA 157గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయినట్టు ఓ వార్త కూడా షేర్ చేశారు మేకర్స్. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి మేమంతా సిద్దం అని చిరంజీవి టీంతో దిగిన ఫొటోను డైరెక్టర్ వశిష్ఠ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా హీరోయిన్లుగా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కథానుగుణంగా మూడు ఫీ మేల్ లీడ్ రోల్స్ ఉండనున్నాయట. అంతేకాదు ఐశ్వర్యారాయ్, మృణాళ్ ఠాకూర్‌ను కూడా సంప్రదించారని లేటెస్ట్ టాక్. మరో పాత్రలో అనుష్కాశెట్టిని అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. అనుష్కాశెట్టి అయితే మెయిన్ రోల్‌కు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని మేకర్స్ కు సూచించాడట చిరు. అయితే ఈ వార్తలపై స్వీటీ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరి మెగాస్టార్ సినిమాలో ఎవరెవరు ఛాన్స్ కొట్టేస్తారనేది సస్పెన్స్ నెలకొంది.
ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.. కాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala) డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయనున్నాడు.
MEGA 157 ప్రీ ప్రొడక్షన్ షురూ..
The Pre-production for #Mega157 begins with a bang ❤🔥
Brace yourselves for a MEGA MASS BEYOND UNIVERSE ♾️
MEGASTAR @KChiruTweets @DirVassishta @NaiduChota @UV_Creations pic.twitter.com/d488SxjxOn
— UV Creations (@UV_Creations) September 10, 2023
MEGA 157 కాన్సెప్ట్ పోస్టర్..
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023