OTT/Theatrical Releases | ఈ వారం ఓటీటీ/థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు
OTT/Theatrical Releases | కరోనా కారణంతో వాయిదా పడ్డ పెద్ద పెద్ద సినిమాలన్ని విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను సాధిస్తున్నాయి. రాధేశ్యామ్ నుంచి ప్రతి రెండు వారాలకు ఒక పెద్ద సినిమా విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రాధేశ్యామ్ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ట్రిపుల్ ఆర్ థియేటర్లలో దూసుకుపోతున్న సమయంలో డబ్బింగ్ సినిమాలు బీస్ట్, కేజీఎఫ్-2 విడుదలయ్యాయి. బీస్ట్ పరాజయం అవగా కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత మరో పెద్ద సినిమా ఆచార్య విడుదల కానుంది. ఆచార్యతో పాటు మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఆచార్య:

టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపైన అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కన్మణి రాంబో ఖతిజా:

తమిళ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కణ్మణి రాంబో ఖతిజా’. నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. చిత్ర బృందం మొదటి నుంచే ప్రమోషన్లను విభిన్నంగా చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్‌ను క్రియేట్ చేశారు. దాంతో ఈ చిత్రంపై తెలుగులోనే మంచి బజ్ ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రన్ వే 34:

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం రన్ వే 34. అజయ్‌దేవగన్ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. 2015లో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ పైలెట్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది.
ఓటీటీ:
గంగూబాయి కతియావాడి:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలీయా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ముంభైలోని కామతిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్రలో ఆలీయాభట్ నటించింది. ఈ చిత్రంలో ఆలీయా నటన వర్ణనాతీతం. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈమె నటనకు ప్రశంసలు జల్లులు కురిపించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 26నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
మిషన్ ఇంపాజిబుల్:

వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్లో స్థిర పడిపోయిన ఈ బ్యూటీ చాలా కాలం తర్వాత మిషన్ ఇంపాజిబుల్ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తాప్సీ జర్నలిస్ట్‌గా నటించింది. సంజయ్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలై మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 29నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వీటితోపాటుగా
మూవీస్:
365 డేస్(హాలీవుడ్) :’నెట్‌ఫ్లిక్స్’ (ఏప్రిల్27)
ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్(హాలీవుడ్) :’నెట్‌ఫ్లిక్స్’ (ఏప్రిల్29)
నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్(హిందీ) :’జీ-5 (ఏప్రిల్29)
పాయానిగళ్ గవనిక్కవుమ్(తమిళ్) :’ఆహా తమిళ్’ (ఏప్రిల్29)
వెబ్ సిరీస్:
బ్యారీ(హాలీవుడ్) : ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ (ఏప్రిల్25)
ది ఆఫర్(హాలీవుడ్) : ‘వూట్’ (ఏప్రిల్28)
ఓ జార్క్(హాలీవుడ్) : ‘నెట్‌ఫ్లిక్స్’ (ఏప్రిల్29)
బేక్డ్(హిందీ) : ‘వూట్’ (ఏప్రిల్25)
అన్డన్( కార్టూన్ సరీస్) : ‘అమేజాన్ ప్రైమ్’ (ఏప్రిల్29)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

