అరంగేట్రానికి ఇదే మంచి కథ అనుకున్నా!
‘కథలో నవ్యత ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ సినిమాలైతే ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నారు. ‘స్వాతిముత్యం’ కథలో వైవిధ్యంతో పాటు ఆసక్తికరమైన పాయింట్ బాగా నచ్చింది. నా అరంగేట్రానికి ఇదే ఉత్తమమైన కథాంశం అనిపించింది’ అన్నారు బెల్లంకొండ సాయి గణేష్.
‘కథలో నవ్యత ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ సినిమాలైతే ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నారు. ‘స్వాతిముత్యం’ కథలో వైవిధ్యంతో పాటు ఆసక్తికరమైన పాయింట్ బాగా నచ్చింది. నా అరంగేట్రానికి ఇదే ఉత్తమమైన కథాంశం అనిపించింది’ అన్నారు బెల్లంకొండ సాయి గణేష్. ఆయన కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దసరా సందర్భంగా విడుదలైంది. ఈ సందర్భంగా ఇటీవల బెల్లంకొండ గణేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు.
ఓ క్లాస్ సినిమాతో అరంగేట్రం చేయడానికి కారణమేమిటి?
సినిమా అంటే పోరాటాలు, కొన్ని పాటలు..ఇలా ఓ ఫార్మాట్లో ఉండాలనుకోను. కథలో నవ్యత ఉంటే ఏ తరహా చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు లక్ష్మణ్ చెప్పిన కథ బాగా నచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీగారికి చెబితే..ఆయన కూడా బాగుందన్నారు. తమ బ్యానర్లో సినిమా చేస్తానని ముందుకొచ్చారు.
హీరోగా తొలిసారి సెట్లో అడుగుపెట్టడం ఎలా అనిపించింది?
సినిమారంగం నాకేమీ కొత్త కాదు. గతంలో నిర్మాణ వ్యవహారాల్ని పర్యవేక్షించిన అనుభవం ఉంది. తొలి నుంచి సినీరంగంలోనే ఏదో ఒకటి సాధించాలనే బలమైన పట్టుదల ఉండేది. నటనలో శిక్షణ తీసుకోవడం, ముందే వర్క్‌షాప్‌లు నిర్వహించడం వల్ల షూటింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడి ఫీల్ కాలేదు. అంతా సవ్యంగా జరిగిపోయింది.
‘విక్కీ డోనార్’ చిత్రంతో మీ సినిమాను పోల్చుతున్నారు కదా?
రెండు సినిమాల కథాంశాల్లో పోలికలు ఉన్నా..స్క్రీన్‌ప్లే, ట్రీట్మెంట్ పరంగా రెండింటికి ఎలాంటి సంబంధం కనిపించదు. సినిమా చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది.
చక్కటి కుటుంబ కథా చిత్రమంటున్నారు..వినోదం ఎలా ఉండబోతున్నది?
ఆద్యంతం ప్రేక్షకులకు నవ్వుల్ని పంచుతుంది. సందర్భోచిత హాస్యంతో ఆకట్టుకుంటుంది. బలవంతపు కామెడీ ఎక్కడా కనిపించదు. సినిమా చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకొస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదభరితమైన సినిమా చూశామని సంతృప్తిగా ఫీలవుతారు.
మీ నాన్న బెల్లంకొండ సురేష్‌గారు మిమ్మల్ని హీరోగా లాంచ్ చేస్తే బాగుండేదని అనుకున్నారా?
తొలుత ఈ కథను నాన్నకే చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. అయితే నేను ఇంట్రడ్యూస్ అయ్యే సినిమాను బయట బ్యానర్లోనే చేయాలని ముందే అనుకున్నా. సొంత బ్యానర్ కాకుండా బయ టి వాళ్లదైతే కథపై నమ్మకంతో సినిమా చేశారని ప్రేక్షకులకు విశ్వాసం ఏర్పడుతుంది.
కథాంశాల ఎంపికలో మీ అభిరుచులు ఏమిటి? ఏ తరహా సినిమాకు ప్రాధాన్యతనిస్తారు?
స్వతహాగా నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు ఇష్టం. నటుడిగా అన్ని జోనర్స్ చేయాలనుకుంటున్నా. మొదటి పది చిత్రాలకు విభిన్నమైన కథలు, జోనర్స్‌ను ఎంచుకుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ‘నేను స్టూడెంట్’ అనే ఒక థ్రిల్లర్ సినిమా చేస్తున్నా. షూటింగ్ పూర్తయింది. రెండు నెలల్లో విడుదలవుతుంది.
మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. అయితే రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక మాత్రం ఉంది. ఇక హీరోల్లో వెంకటేష్‌గారిని అభిమానిస్తాను. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. మంచి కథ కుదిరితే అన్నయ్య శ్రీనివాస్‌తో కలిసి తప్పకుండా సినిమా చేస్తాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

