నీ సొగసు ఇలకే అందం
స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పార్క్'. మోహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పార్క్’. మోహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 17న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘ఏమా అందం’ అనే తొలి గీతాన్ని బుధవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాల్ని సమకూర్చిన ఈ గీతానికి అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్నందించారు.
సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. ‘ఏమా అందం ఏమా అందం భామా నీకు భువితో ఏమి సంబంధం.. ఏ మానవుడు చూడనే లేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని..తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

