జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘అవతార్-2’ (ది వే ఆఫ్ వాటర్) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 16న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. అత్యాధునిక సాంకేతికాంశాలతో అండర్‌వాటర్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్లో కూడా విడుదలకానుంది. కాగా ‘అవతార్-2’ తెలుగు వెర్షన్‌కు దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో మంచి పట్టున్న శ్రీనివాస్ అవసరాల తెలుగు వెర్షన్ కోసం అద్భుతమైన సంభాషలందించారని చెబుతున్నారు.