రౌడీల బెండుతీసే ఫ్యామిలీస్టార్
‘లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే’.. అన్నాడు విలన్ ఎగతాళిగా.. ‘భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషికాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?
‘లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే’.. అన్నాడు విలన్ ఎగతాళిగా.. ‘భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషికాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి? అని కూల్‌గా.. ఆ పక్కనే ఉన్న విలన్ మనిషి తలని ఫ..ట్ మని పగలగొట్టేశాడు. అందరూ షాక్.. ‘సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా..’ అందరూ అర్థంకానట్టు చూస్తున్నారు. టీజర్ ఎండ్.. బావున్నాయి కదూ డైలాగులు.
ఇవి మన విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా టీజర్లోనివి. ఈ డైలాగుల్ని బట్టి హీరో కేరక్టరైజేషన్ చెప్పేయొచ్చు. దానికి తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఈ సంస్థ నుంచి వస్తున్న 54వ సినిమా. బుధవారం ఈ చిత్రం టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీమ్యాన్‌లా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌లా ఇందులో దేవరకొండ విజయ్ కనిపిస్తాడని దర్శకుడు పరశురామ్ చెప్పాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

