సల్మాన్‌ఖాన్‌కు 17 ఏళ్ల కూతురు ఉందా?

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ వయసు ఇప్పటికే ఐదు పదులు దాటి ఐదేళ్లయింది. అయినా అతడు బ్యాచిలరే అన్న విషయం అందరికీ తెలుసు. ఐశ్వర్యరాయ్ నుంచి కత్రినా కైఫ్ వరకూ ఎంతో మందితో డేటింగ్ చేసినా.. ఆ బంధాన్ని మాత్రం పెళ్లి వరకూ తీసుకెళ్లలేదు. అయితే అదంతా అబద్ధం. అతనికి నూర్ అనే భార్య ఉంది. 17 ఏళ్ల కూతురు కూడా ఉంది. వాళ్లను అతడు దుబాయ్‌లో దాచి పెట్టాడు. సల్మాన్ వాళ్లతోనే ఉంటాడు అని ఓ యూజర్ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
తాజాగా సల్మాన్ తన తమ్ముడు అర్బాజ్ ఖాన్ షో పించ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ ట్వీట్ మరోసారి తెరపైకి వచ్చింది. తమపై సోషల్ మీడియాలో వచ్చిన దారుణమైన కామెంట్ల గురించి సెలబ్రిటీలను అడిగి వాళ్ల రియాక్షన్ తెలుసుకోవడమే ఈ షో స్పెషాలిటీ. ఈ షో సీజన్ 2 ఇప్పుడు నడుస్తోంది. ఇందులో భాగంగా షోకు గెస్ట్‌గా వచ్చిన సల్మాన్‌ను అర్బాజ్ ఇదే ప్రశ్న అడిగాడు.
పిరికివాడా, ఎక్కడ దాచిపెట్టావ్? మొత్తం ఇండియాకు తెలుసు. నువ్వు దుబాయ్‌లో భార్య నూర్, 17 ఏళ్ల కూతురుతో ఉన్నావని. ఎన్నాళ్లు మమ్మల్ని వెర్రివాళ్లను చేస్తావ్ అని ఆ యూజర్ చేసిన ట్వీట్ గురించి అర్బాజ్.. సల్మాన్‌ను అడిగాడు. ఇది విని షాక్‌కు గురైన సల్మాన్.. ఈ ప్రశ్న నాకేనా అని అడిగాడు. అవును నీకే అని అర్బాజ్ చెప్పడంతో.. ఇదంతా అబద్ధం. వాళ్లు ఎవరి గురించి మాట్లాడారో నాకు తెలియదు. నాకు భార్య లేదు. నేను ఇండియాలోనే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటాను. 9 ఏళ్ల వయసు నుంచీ అక్కడే ఉంటున్నాను. నేను ఇతని కామెంట్స్‌పై స్పందించను అని సల్మాన్ అన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Arbaaz Khan
- Dubai
- pinch
- Pinch 2
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

