Varun Tej | అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుంది : వరుణ్‌తేజ్
మెగా హీరోల్లో వరుణ్తేజ్ది ఓ ప్రత్యేకశైలి. కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలతో సినిమాలను ఎంచుకుంటారు వరుణ్. ఆ జాబితాలోనే ఆయన నటించిన మరో తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Varun Tej | మెగా హీరోల్లో వరుణ్తేజ్ది ఓ ప్రత్యేకశైలి. కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలతో సినిమాలను ఎంచుకుంటారు వరుణ్. ఆ జాబితాలోనే ఆయన నటించిన మరో తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి రీజన్?
ప్రవీణ్‌సత్తారు సినిమాల్లోని కాన్సెప్ట్‌లు, సెన్సిబిలిటీస్ నాకు నచ్చుతాయి. ఈ కథను నేను విన్న తరువాత సాధారణంగా ైస్టెలిష్ యాక్షన్ మూవీస్ అంటే యాక్షన్, ైస్టెలిష్ అంశాల మీద ఫోకస్ ఎక్కువగా వుంటుంది.కంటెంట్ తక్కువగా వుంటుంది. కానీ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్ద అంశం అని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ సమస్యను ఎవరం పట్టించుకోం. అది వెంటనే మనపైన ప్రభావం చూసేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తరువాత వుంటుంది. ప్రవీణ్ చెప్పినప్పుడు కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి.
ఈ కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి?
నటుడిగా ఓ సామాజిక బాధ్యతాయితమైన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. ఆ అవకాశం నాకు ఈ సినిమాతో దొరికింది. మంచి కథతో పాటు సామాజికి బాధ్యతను గుర్తుచేసేలా వుండే సినిమా చేయడం కరెక్ట్ అనిపించింది.
టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
‘గాండీవధారి అర్జున’ కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. టైటిల్ క్యాచీగా లేకపోయినా ఈ టైటిలే కరెక్ట్‌గా వుంటుంది. రేపు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
ఈ చిత్రంలో వుండే సందేశం ఎలాంటిది?
ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పడం లేదు. ఇప్పుడున్న సమస్య ఏమిటి? అనే దాన్ని చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. నేను రీసెంట్గా సినిమాను చూశాను. నాకు నచ్చింది. ఎవరైనా క్లాస్ పీకినట్లు ఏ విషయమైనా చెబితే బోర్ కొట్టేస్తుంది. సినిమా అయినా అంతే కాస్త ఎంటర్టైనింగ్ పంథాలో చెబితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా విషయానికి వస్తే యాక్షన్ ఎంటర్టైనర్గా చెప్పే ప్రయత్నాం చేశాం.
మీ తదుపరి చిత్రం ఏమిటి?
ఇప్పుడు నేను చేస్తున్న మట్కా సినిమాలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ వుంటాయి. అందులో నా పాత్రలో నాలుగు షేడ్స్ వుంటాయి. మట్కా అనే ఆట ఎలా ప్రారంభమైందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

