ఇంతిని ప్రకృతి కాంతతో పోలుస్తారు. ఆ ప్రకారంగా.. ఆమె కురులు నీలాకాశం. ఆమె మనసు గంభీర సముద్రం. క్షమలోనే కాదు, ప్రేమలోనూ ఆమె ధరిత్రియే! ఆ స్ఫూర్తితో అనీషా షెట్టి అనే డిజైనర్ ప్రాణంపోసిన డ్రెస్ ఇది. చీర, లెహంగా, అనార్కలి.. కలబోత కూడా. లెహంగా మీది ఎంబ్రాయిడరీ పత్ర, ఫల, పుష్పభరిత వనాన్ని గుర్తుకు తెస్తుంది.