Thalaivar 171 | రజినీకాంత్ తలైవా 171లో క్రేజీ బాలీవుడ్ యాక్టర్.. టాక్ నిజమయ్యేనా..?
Thalaivar 171 | తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న తలైవా 171 (Thalaivar 171). ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Thalaivar 171 | తమిళ ఇండస్ట్రీ నుంచి సినిమాలు చేస్తూ ఇండియావైడ్‌గా సూపర్ ఫేం సంపాదించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న తలైవా 171 (Thalaivar 171). ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ మూవీలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే న్యూస్ తెరపైకి వచ్చింది. మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం లోకేశ్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను సంప్రదించగా.. కథ కూడా నచ్చిందట. అయితే అభిమానులు తనను లీడ్ రోల్స్‌లో చూసేందుకు ఇష్టపడుతున్న నేపథ్యంలో షారుఖ్ సున్నితంగా నో చెప్పాడని తెలుస్తోంది. కాగా ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ రణ్ వీర్ సింగ్‌ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.
రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్‌ను చేసేందుకు రెడీగా ఉన్నాడని.. త్వరలోనే దీనిపై సంతకం కూడా చేయబోతున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై రజినీకాంత్ – రణ్వీర్ సింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందా..? అని అప్పుడే ఊహించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు. మరి ఈ క్రేజీ అప్డేట్ గురించి లోకేశ్ కనగరాజ్ టీం రాబోయే రోజుల్లో ఏదైనా హామీనిస్తుందేమో చూడాలి.
రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, తలైవా 171 సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పాడు. రోబో సినిమా తర్వాత తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నా. అంతేకాదు రజినీకాంత్ పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశాడు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు తలైవా 171 చిత్రంలో రజినీలోని మరో కోణాన్ని పూర్తిగా ఆవిష్కరించబోతున్నానని, ఇది తన కెరీర్లోనే ఉత్తమ కథ అని చెప్పుకొచ్చాడు లోకేశ్ కనగరాజ్.

Ranveer Singh
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

