దండించే రాముడు!

సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మహేష్ కోనేరు, సృజన్ నిర్మాతలు. ఈ నెల 30న థియేటర్స్‌లో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్ పాత్రను పోషించారు. ఓ కేసు తాలూకు వాదోపవాదాలు, అర్థవంతమైన సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘కోర్ట్‌కు కావాల్సింది షార్ట్‌ఫిల్మ్స్, మాక్‌డ్రిల్స్ కాదు…బలమైన ఆధారాలు’..‘నువ్వు సగం బలం లాక్కునే వాలివయితే..నేను దండ వేసి దండించే రాముడిలాంటివాడిని’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా అనిపించాయి. అన్యాయాన్ని ఏమాత్రం సహించని లాయర్‌గా సత్యదేవ్ పాత్ర చిత్రణ శక్తివంతంగా కనిపించింది. ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Sathyadev
- thimmarusu
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

