Year End 2023 |ప్లే బ్యాక్ 2023.. ఈ ఏడాది పరిచయమైన కొత్త హీరోయిన్లు వీళ్లే..!
Year End 2023 | సముద్రం అన్నాక అలలు.. ఇండస్ట్రీ అన్నాక కొత్త హీరోయిన్లు కామన్. ప్రతీ ఏడాది ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. కానీ అందులో చాలా మంది వచ్చినట్లు కూడా ఎవరికీ ఐడియా ఉండదు. చాలా తక్కువ మంది ముద్దుగుమ్మలు మాత్రం తమ టాలెంట్ చూపిస్తుంటారు.
Year End 2023 | సముద్రం అన్నాక అలలు.. ఇండస్ట్రీ అన్నాక కొత్త హీరోయిన్లు కామన్. ప్రతీ ఏడాది ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. కానీ అందులో చాలా మంది వచ్చినట్లు కూడా ఎవరికీ ఐడియా ఉండదు. చాలా తక్కువ మంది ముద్దుగుమ్మలు మాత్రం తమ టాలెంట్ చూపిస్తుంటారు. అలాగే 2023లోనూ కొందరు కొత్త హీరోయిన్లు తమ ప్రతిభ చూపించారు.. మేం కూడా ఉన్నామని గుర్తు చేశారు. హిట్టు ఫ్లాపులు పక్కనబెడితే దాదాపు 10 మంది హీరోయిన్లు ఈ ఏడాది తమ సత్తా చూపించారు. తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఆ న్యూ ఫేసెస్ ఎవరో చూద్దామా..
వైష్ణవి చైతన్య:
2023లో ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. అందులో అందరికంటే ముందు నిలిచే ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ఎక్కడో యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్ చేసుకునే ఈ అమ్మాయి బేబీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో.. మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది వైష్ణవి.
రెబా మోనికా జాన్:
వైష్ణవి చైతన్య తర్వాత టాలీవుడ్లో అంత ప్రభావం చూపించిన మరో హీరోయిన్ రెబా మోనికా జాన్. ఈమె నటించిన సామజవరగమన సంచలన విజయం సాధించింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతో రెబాకు మంచి పేరు వచ్చింది.
సాక్షి వైద్య:
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ సాక్షి వైద్య. ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా సాక్షికి మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది సాక్షి. పవన్ ఉస్తాద్‌తో పాటు సాయి ధరమ్ తేజ్, రవితేజ సినిమాల్లోనూ నటిస్తుంది సాక్షి వైద్య.
యుక్తి తరేజా:
2023లో ఆకట్టుకున్న మరో కొత్త హీరోయిన్ యుక్తి తరేజా. నాగ శౌర్య హీరోగా నటించిన రంగబలితో పరిచయమైంది ఈ బ్యూటీ. సినిమా ఫ్లాపైనా యుక్తి అందాలు బ్లాక్‌బస్టర్ అయింది.
అషికా రంగనాథ్:
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్‌తో పరిచయమైన బ్యూటీ అషికా రంగనాథ్. ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ అషికా మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు నాగార్జున నా సామిరంగాలో నటిస్తుంది ఈ బ్యూటీ.
గాయత్రి భరద్వాజ్:
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావుతో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా పరిచయం అయింది. ఇందులో కనిపించింది కాసేపే అయినా గాయత్రి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నుపుర్ సనన్:
టైగర్ నాగేశ్వరరావుతోనే పరిచయమైన మరో హీరోయిన్ నుపుర్ సనన్. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు ఈమె. ఇందులో రవితేజతో కనిపించింది కాసేపే అయినా నుపుర్ గ్లామర్‌కు మంచి పేరు వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

