నవంబర్ వచ్చేసింది.. అప్డేట్ ఎప్పుడు?
నవంబర్ నెలలో ‘SSMB 29’ అప్డేట్ ఉంటుందని తెలిసిన నాటి నుంచి ఈ నెల కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నవంబర్ వచ్చేసింది. విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమా అప్డేట్ ఎప్పుడిస్తారు? ఎలా ఇస్తారు? ఏం ప్రకటిస్తారు? మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్ ఉంటుందా? టైటిల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందా? ఇలా ఆడియన్స్‌లో వేయి ప్రశ్నలు.
నవంబర్ నెలలో ‘SSMB 29’ అప్డేట్ ఉంటుందని తెలిసిన నాటి నుంచి ఈ నెల కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నవంబర్ వచ్చేసింది. విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమా అప్డేట్ ఎప్పుడిస్తారు? ఎలా ఇస్తారు? ఏం ప్రకటిస్తారు? మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్ ఉంటుందా? టైటిల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందా? ఇలా ఆడియన్స్‌లో వేయి ప్రశ్నలు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌బాబు సైతం తన ఎక్స్ వేదికగా అప్డేట్ ఎప్పుడొస్తుందంటూ రాజమౌళిని నిలదీశారు. దీనికి జక్కన తనదైన శైలిలో స్పందించారు.
ఈ మీట్లో కథానాయిక ప్రియాంక చోప్రా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయినవ్వడంతో సంభాషణ సరదాగా సాగింది. ‘నవంబర్ వచ్చేసింది.. అప్డేట్ ఎప్పుడు?’ అని మహేశ్ అడిగితే.. ‘అవునూ.. ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్?’ అంటూ మాట దాట వేశారు రాజమౌళి. ‘మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా..’ అంటూ వెటకారంగా సమాధానమిచ్చిన మహేశ్.. ‘నవంబర్‌లో అప్డేట్ అన్నారు. మాట నిలబెట్టుకోండి..’ అంటూ రెట్టించారు.
‘ఇప్పుడేకదా నవంబర్ మొదలైంది.. నెమ్మదిగా ఇద్దాం..’ అన్నారు రాజమౌళి తాపీగా. దాంతో షాకైన మహేశ్.. ‘నెమ్మదిగానా?.. ఎంత నెమ్మదిగా? 2030లోనా?’ అన్నారు.. ఇలా వీరి సంభాషణ సాగింది. మధ్యలో ప్రియాంక, పృథ్వీరాజ్ కూడా జాయిన్ అవ్వడంతో మరింత సరదాగా ఈ సంభాషణ ముగిసింది. ఇదిలావుంటే.. ఈ నెల రెండోవారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘SSMB 29’కి సంబంధించి, ఓ భారీ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ వేడుకలోనే ఆప్డేట్ని కూడా విడుదల చేస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నదని వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

