Janhvi Kapoor | అలియా అవకాశాలను తన్నుకుపోతున్న జాన్వీ.. టాలీవుడ్లో తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేయనుందా?
శ్రీదేవి దారిలోనే ఆమె కూతురు జాన్వీకపూర్ కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచే పనిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ రివర్స్. శ్రీదేవి ఇల్లు దక్షిణాది. ఇక్కడ గెలిచి, తర్వాత బాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా జెండా పాతారామె.
Janhvi Kapoor | శ్రీదేవి దారిలోనే ఆమె కూతురు జాన్వీకపూర్ కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచే పనిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ రివర్స్. శ్రీదేవి ఇల్లు దక్షిణాది. ఇక్కడ గెలిచి, తర్వాత బాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా జెండా పాతారామె. ఇప్పుడు జాన్వీ కపూర్ ఇల్లు ఉత్తరాది. అక్కడ ధడక్, గుంజన్ సక్సేనా సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలదొక్కుకొని, రచ్చ గెలవటానికి టాలీవుడ్‌పై కన్నేశారీమె. ఆమె తారక్‌తో ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే తెలుగు డైరెక్టర్ల తాకిడి జాన్వీకి ఎక్కువైపోయిందట.
అయితే ఆమె సినిమాల విషయంలో ఫైనల్ నిర్ణయం తండ్రి బోనీ కపూర్‌దే అని టాలీవుడ్ టాక్. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అలియాభట్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తారని అనుకున్నారు. ఆమెకు అవకాశాలు కూడా అలాగే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశాలన్నీ జాన్వీ తన్నుకుపోతున్నట్టు ఫిలిం వర్గాల టాక్. చూస్తూవుంటే టాలీవుడ్లో తన తల్లి శ్రీదేవి లెగసీని జాన్వీ కంటిన్యూ చేసేలావున్నారనేది పలువురి అభిప్రాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Dhadak
- janhvi kapoor
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

