స్టార్డమ్కు చెల్లుచీటీ

గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్డమ్ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా కోసం ఎన్ని రోజులైనా వేచిచూసేవారు. ఓటీటీ ఆగమనంతో కంటెంట్ సినిమాల్ని శాసిస్తోంది. ప్రధాన స్రవంతి సినిమాలకు భిన్నంగా వినూత్న కథల్ని ఎంచుకోవడానికి ఓటీటీ గొప్ప మార్గంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులైన రచయితలు, నటీనటులకు ఓటీటీ పెద్దపీట వేస్తోంది. పాత్రపరంగా కొత్తదనాన్ని చూపించడంతో పాటు ప్రతిభకు మెరుగులుదిద్దుకోవడానికి ఓటీటీకి మించిన వేదిక లేదు’ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్స్టోరీ’ ఓటీటీ సిరీస్‌ల ద్వారా తమన్నా డిజిటల్ రేసులో దూసుకుపోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

