తెలుగు స్టార్ హీరో ప్రభాస్తో బాలీవుడ్ తార కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల హీరో వరుణ్ ధావన్ వీరి స్నేహం గురించి చేసిన వ్యాఖ్యలు వదంతులకు మరింత ఊతమిచ్చాయి. ఇవి ఇంకా వ్యాప్తి కాకముందే స్పష్టత ఇచ్చింది నాయిక కృతి సనన్. తాజా ఇన్స్టా పోస్ట్ ద్వారా తమ మధ్య ఉన్నది ప్రేమ కాదని తేల్చి చెప్పింది. ఆమె స్పందిస్తూ…‘మా మధ్య ఉన్నది ప్రేమ కాదు. ఇది కావాలని చేసిన ప్రచారం కాదు. సరదా ఎక్కువై వరుణ్ మాట్లాడిన మాటలు అందరికీ తప్పుడు సంకేతాలు పంపాయి.
ఓ డాన్స్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనవసర ప్రచారాలకు దారి తీశాయి. ఏదో ఒక వెబ్ సైట్ మా పెండ్లి తేదీని ప్రకటించకముందే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మా ప్రేమ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.’ అని పేర్కొంది.