The Paradise | భారీ ధరకు అమ్ముడుపోయిన నాని “ది ప్యారడైజ్” ఆడియో రైట్స్
The Paradise Audio Rights | హిట్ 3తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
The Paradise Audio Rights | హిట్ 3తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో పాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరిగమ మ్యూజిక్ రూ. 18 కోట్లకు “ది ప్యారడైజ్” ఆడియో రైట్స్‌ని దక్కించుకున్నట్లు సమాచారం. నాని కెరీర్లో ఒక సినిమా ఆడియో హక్కులకు ఇంత పెద్ద మొత్తం రావడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదల కాకముందే ఆడియో హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవడం చిత్ర యూనిట్‌కు ఉత్సాహాన్నిచ్చింది.
ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

