Nayanthara | నా కెరీర్లో చెత్త సెలక్షన్ అంటే ఆ సినిమానే: నయనతార
నయనతార కెరీర్ని మలుపుతిప్పిన సంవత్సరం 2005. ఎందుకంటే ఆ ఏడాది రెండు బ్లాక్బాస్టర్లు ఆమెకు దక్కాయి. అందులో మొదటిది ‘చంద్రముఖి’ కాగా.. రెండోది ‘గజనీ’. ఈ రెండు సినిమాల్లో నయనతార సెకండ్ హీరోయినే కావడం గమనార్హం. అయితే.. ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ రెండు సినిమాలే.
Nayanthara | నయనతార కెరీర్ని మలుపుతిప్పిన సంవత్సరం 2005. ఎందుకంటే ఆ ఏడాది రెండు బ్లాక్బాస్టర్లు ఆమెకు దక్కాయి. అందులో మొదటిది ‘చంద్రముఖి’ కాగా.. రెండోది ‘గజనీ’. ఈ రెండు సినిమాల్లో నయనతార సెకండ్ హీరోయినే కావడం గమనార్హం. అయితే.. ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ రెండు సినిమాలే. ఆడియన్స్ అభిప్రాయం కూడా ఇదే.. కానీ నయన్ అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో చెత్త సెలక్షన్ అంటే ‘గజనీ’ సినిమానే చెబుతా.
ఇప్పటికీ ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతుంటా. చెప్పింది వేరు.. తీసింది వేరు. అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. అదొక పాఠంగా తీసుకొని తర్వాత నుంచి జాగ్రత్త పడుతున్నాను’ అని చెప్పింది. అయితే.. నయన్ మాటలతో కొందరైతే ఏకీభవించడంలేదు. అసలు తనకి పేరు తెచ్చిందే ‘గజనీ’ సినిమా. ఆ సినిమా గురించి నయన్ అలా మాట్లాడటం తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

