The Warriorr | రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది వారియర్’
The Warriorr | విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే భావనతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాది ‘రెడ్’లో కూడా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈయన ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
చిత్రబృందం తాజాగా సెట్లో దిగిన ఫోటోస్‌ను షేర్ చేస్తూ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. ఫోటోస్‌ను గమనిస్తే పాటతో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసాయి. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 14న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
#TheWarriorr has finished his War on Sets ⚔️
Now, he is all set to Invade the theatres on July 14 ❤️🔥#TheWarriorrOnJuly14 @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/CYlg2sn79n
— BA Raju's Team (@baraju_SuperHit) May 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

