రామ్ పేరు పెద్ద సౌండ్‌తో వినిపిస్తుంది
‘రామ్ ఈ సినిమా ద్వారా తమిళంలో పరిచయం అవుతున్నారు. అతని డ్యాన్సులు చూశాను. అద్భుతంగా అనిపించాయి.
‘రామ్ ఈ సినిమా ద్వారా తమిళంలో పరిచయం అవుతున్నారు. అతని డ్యాన్సులు చూశాను. అద్భుతంగా అనిపించాయి. వయసు కాస్త తక్కువ ఉండుంటే అతనితో కలిసి సినిమా చేసేవాడినికి కదా అనుకున్నా’ అని అన్నారు సీనియర్ దర్శకుడు భారతీరాజా. ‘ది వారియర్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం చెన్నైలో జరిగింది. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది.
ఈ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ ‘తెలుగు ఇండస్ట్రీ గొప్పగా ఎదుగుతున్నది. లింగుస్వామి ‘ది వారియర్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. బుల్లెట్సాంగ్, విజిల్సాంగ్ బాగా ఆకట్టుకుంటున్నాయి’ అన్నారు. లింగుస్వామి చాలా మంచి వ్యక్తి అని, కోవిడ్ సమయంలో దర్శకుల మధ్య అనుసంధానకర్తగా చక్కటి సేవలందించారని అగ్ర దర్శకుడు మణిరత్నం ప్రశంసించారు. శంకర్ మాట్లాడుతూ ‘మంచి టైటిల్ ఇది. అందరం జీవితంలో ఏదో ఒకటి సాధించటానికే పోరాడుతుంటాం. ట్రైలర్ చూసినప్పుడు రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది’ అని చెప్పారు. ‘తమిళ ఎంట్రీ కోసం 15 ఏళ్లు ఎదురుచూశా.
ఈ స్థాయిలో ఇంట్రడక్షన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమాతో పరిచయం కావడం ఓ ఆశీర్వాదంలా భావిస్తున్నా’ అని హీరో రామ్ తెలిపారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ‘నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా తర్వాత రామ్ పేరు మరింత పెద్ద సౌండ్‌తో వినిపిస్తుంది. ఆయన ప్రదర్శించిన హీరోయిజం, డాన్సులు హైలైట్‌గా అనిపిస్తాయి. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘ది వారియర్’ పై ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయని కథానాయిక కృతిశెట్టి ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో సెల్వమణి, విశాల్, ఎస్.జె.సూర్య, ఆది పినిశెట్టి, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

