The Village | వెబ్‌సిరీస్‌తో భయపెట్టేందుకు వస్తున్న ఆర్య.. ఆసక్తి రేకెత్తించేలా ‘ది విలేజ్’ ట్రైలర్
The Village | వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ... తనకంటూ సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య (Arya). ఇక ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
The Village | వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ… తనకంటూ సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య (Arya). ఇక ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య (Arya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ‘ది విలేజ్’ (The Village). మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరిస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఆర్య తన ఫ్యామిలీతో కలిసి రోడ్ ట్రిప్ కి వెళుతుండగా వారి వాహనం పాడవ్వడంతో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ట్రైలర్ గమనిస్తే.. తన ఫ్యామిలీతో కలిసి ఆర్య ఒక భయంకరమైన గ్రామంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడున్న వింత మనుషుల నుంచి తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు ఆర్య ఎలాంటి సాహసాలు చేస్తాడు అనేది సిరీస్ స్టోరీ. ఇక తొలిసారి గ్రాఫిక్ నవల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నవంబరు 24న స్ట్రీమింగ్ కానుంది.
a glimpse into the chilling adventures of ‘the village’#TheVillageOnPrime, Nov 24
Trailer out now pic.twitter.com/JJfmpkeOTB
— prime video IN (@PrimeVideoIN) November 17, 2023
ఇక ఇందులో ఆర్యకు జోడీగా దివ్య పిళ్లై నటిస్తుండగా. ఆడుకాలం నరేన్, ఆజియా, తలైవాసల్ విజయ్, ముత్తు కుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, జయ ప్రకాష్, పిఎన్ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో శక్తి ప్రొడక్షన్ బ్యానర్‌పై గౌరవ్ శ్రీవాస్తవ్, ప్రసాద్ పట్నాయక్ నిర్మిస్తున్నారు.
మరోవైపు ఆర్య ప్రస్తుతం తెలుగులో ‘సైంధవ్’ (Saindhav)లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

