Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ రౌడీ హీరో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటడన్న విషయం తెలిసిందే. తన సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంటారు. అయితే తాజాగా బెంగళురులో చదువుకుంటున్న అభిమాని ఒక పోస్ట్ పెట్టగా దానికి విజయ్ క్యూట్ రిప్లయ్ ఇచ్చాడు.
బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే ఓ నెటిజన్ తన ఫ్రెండ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక రీల్ క్రియేట్ చేసింది. ఈ రీల్ స్టోరీ ఏంటి అంటే.. విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాము అంటూ ఈ వీడియో ఉంది. దీంతో ఈ వీడియో తెగ సర్క్యులేట్ అయ్యింది. ఇక ఈ విషయం తాజాగా విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో వెంటనే విజయ్ రిప్లయ్ ఇస్తూ.. 90% తెచ్చుకో నేను నిన్ను కలుస్తాను అంటూ రాసుకోచ్చాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Inka andaru start adugutharemo 😂
90% 🏃inka ame eppatiki meet avvaledhu emo#vijaydevarakonda #familystar pic.twitter.com/tvPGMTt1wH
— Filmy Bowl (@FilmyBowl) February 18, 2024