Manoj Bajpayee | ‘గవర్నర్’గా రాబోతున్న మనోజ్ బాజ్‌పేయి.. ఫస్ట్ లుక్ విడుదల!
Manoj Bajpayee | జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గవర్నర్: ద సైలెంట్ సేవియర్ (GOVERNOR: The Silent Saviour).
Manoj Bajpayee | జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గవర్నర్: ద సైలెంట్ సేవియర్ (GOVERNOR: The Silent Saviour). ఈ సినిమాకు చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నేడు మనోజ్ బాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. నేడు భారతదేశం ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా వెలుగొందుతోంది అంటే, దాని వెనుక ఒక అజ్ఞాత వీరుడు ప్రాణాలకు తెగించి చేసిన అలుపెరుగని పోరాటం. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ అద్భుత యోధుడి గాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమే గవర్నర్: ద సైలెంట్ సేవియర్ అంటూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను పంచుకుంది.
మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అదా శర్మ, మధు, నోషాద్ మహమ్మద్ కుంజు, పరితోష్ సాండ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తుండగా, దిగ్గజ కవి జావేద్ అక్తర్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్ లాల్ షా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా జూన్12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
We are a world power today
because an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.#VipulAmrutlalShah #ChinmayDeepakMandlekar @Aashin_A_Shah@adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha @JaywantPan94541… pic.twitter.com/mKnWCCOkXp
— manoj bajpayee (@BajpayeeManoj) April 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

