నవతరం మహిళ కథ

‘పురుషాధిక్యత కారణంగా మహిళలకు ఎదురయ్యే వివక్షకు వినోదం, ఉత్కంఠను మేళవిస్తూ రూపొందిన వెబ్‌సిరీస్ ఇది’ అని చెప్పింది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ ‘లెవెంత్ అవర్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ ద్వారా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ ‘సుదీర్ఘప్రయాణంలో చాలా సినిమాలు చేశా. కమర్షియల్ పంథాలో విభిన్నమైన పాత్రలు పోషించా. సినిమాల్లో దర్శకుల సూచనలకు అనుగుణంగానే పనిచేయాల్సివస్తుంది. ఓటీటీలో నటులకు ఎక్కువగా స్వేచ్ఛ దొరుకుతుంది. కొత్తదనాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రను ఈ వెబ్‌సిరీస్‌లో చేశా. సమాజంలోని నవతరం అమ్మాయిలందరికీ ప్రాతినిథ్యం వహిస్తూ సాగే ఈ పాత్ర సరికొత్త అనుభూతిని పంచుతుంది. పెద్ద కుటుంబంలో పుట్టి వ్యాపారవేత్తగా మారిన ఓ యువతి పురుషాధిక్య సమాజం నుంచి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నది. ఆమె జీవితంలో ఉన్న మగవాళ్లతోనే తను ఎలాంటి పోరాటం చేయాల్సివచ్చిందనేది ఆకట్టుకుంటుంది. రెండేళ్ల క్రితం వెబ్‌సిరీస్‌లో నటించాలనే ఆలోచన మొదలైంది. కథ, కథాగమనంతో పాటు పాత్రలు శక్తివంతంగా ఉన్నప్పుడే వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అవన్నీ ఈ వెబ్‌సిరీస్‌కు చక్కగా కుదిరాయి. సమాజంలో నెలకొన్న సంఘటనల్ని వాస్తవిక కోణంలో చూపించాం. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అనే భేదాలు నాకు లేవు. మంచి కంటెంట్‌లో భాగమవ్వడానికే ఇష్టపడతా. ప్రస్తుతం తెలుగులో సీటీమార్, గుర్తుందాశీతాకాలం, ఎఫ్-3తో పాటు హిందీ, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

