హీరో నితిన్ ప్రస్తుతం వరు సగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎక్స్ట్రా’ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. దీని తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. కథానుగుణంగా ఈ సినిమా ప్లాష్‌బ్యాక్‌లో నితిన్ 21 ఏళ్ల యువకుడిగా కనిపిస్తారట. ఇందుకోసం వీఎఫ్ఎక్స్ సహాయంతో నితిన్ లుక్‌ను సహజంగా చూపించబోతున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్ కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ చేసిన ‘భీష్మ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.