Kayadu Lohar First Look The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాయడు లోహర్ (Kayadu Lohar) నేడు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్లో కాయడు రెట్రో లుక్‌లో అలరిస్తుంది.
ఇక ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ స్లమ్ ఏరియా నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని ‘జడల్’ (Jadal) అనే ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రా స్టేట్మెంట్’ (Raw Statement) గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
Wishing the incredible @11Lohar a very Happy Birthday 🫶
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical @SLVCinemasOffl pic.twitter.com/tLnMgTJS2M— Vamsi Kaka (@vamsikaka) April 11, 2026