దర్శకుడు నీలకంఠ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రాన్ని ఎంవీ శరత్చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ…‘ఈ చిత్ర పోస్టర్ చూస్తే సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ అనే మూడు అంశాలు కనిపిస్తాయి. ఈ మూడింటి కలయికే ఈ సినిమా. జీవితంలో కొన్ని అనూహ్య ఘటనల వల్ల కథానాయకుడు ఒక సర్కిల్లోకి లాగబడతాడు.’ అన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటిస్తున్నాను. దర్శకుడు నీలకంఠతో పనిచేయడం వల్ల నటుడిగా పరిణితి చెందాను.’ అన్నారు. నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ…‘దర్శకుడు నీలకంఠ మీద పూర్తి నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది’ అన్నారు.