ప్రతిభకు దక్కిన గౌరవమిది
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్' సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సాధించి భారతీయ సినిమా కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసింది. దర్శకుడు రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్‌గా అవతరించారు.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సాధించి భారతీయ సినిమా కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసింది. దర్శకుడు రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్‌గా అవతరించారు. ఇటీవల ఆయన హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కలుసుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాల్ని వివరించిన విషయం తెలిసిందే. స్టీవెన్ స్పీల్బర్గ్ అభిమాని అయిన రాజమౌళి ‘నేను దర్శక దేవుడిని కలిశాను’ అంటూ సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశాడు.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వీక్షించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ‘గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించారు. ఆయనకు ఎంతగానో నచ్చింది. తన భార్య సుజీకి సినిమా గురించి వివరించి.. ఆమెతో పాటు మరోసారి సినిమా చూశారు. ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. పది నిమిషాల పాటు ఆయన మా సినిమాను విశ్లేషిస్తూ మాట్లాడటం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది’ అని రాజమౌళి పేర్కొన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్‌పై కామెరూన్ ప్రశంసలు
జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారని సంగీత దర్శకుడు కీరవాణి పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజిక్ గురించి జేమ్స్ కామెరూన్ నాతో మాట్లాడారు. పాశ్చాత్య సంగీతంతో పోల్చితే ‘ఆర్ఆర్ఆర్’ ఎందుకు భిన్నమైనదో చక్కగా వివరించారు. ఆయన ప్రశంసలు నా ప్రతిభకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఇదిలా ఉండగా ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో 2023 సంవత్సరానికిగాను క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో రాజమౌళి స్వీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

