రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘జైలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో రక్తం మరకలతో ఉన్న కత్తి వేలాడుతూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రజనీకాంత్ నటించబోతున్న 169వ చిత్రమిది.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విజయ్‌తో ‘బీస్ట్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించి సత్తా చాటారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇప్పుడు రజనీకాంత్ చిత్రం కోసం ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేశారని తెలిసింది. యాక్షన్ డ్రామాగా రూపొందించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్నందించబోతున్నారు. త్వరలో సెట్స్మీదకెళ్లనుంది.