సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ‘హంట్’. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు మహేష్ రూపొందించారు. ఈ నెల 26న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ…‘కృష్ణగారి ప్రోత్సాహం వల్లే ఇండస్ట్రీలోకి రాగలిగాను. కృష్ణగారు తన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే కొత్త తరహా చిత్రాలు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమాలో నటించాను. ఈ కథను ఏ హీరో అటెంప్ట్ చేయడు. యాక్షన్ కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
నేను పోషించిన అర్జున్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. గతం మర్చిపోయిన తర్వాత పాత్ర చేసేందుకు కష్టపడ్డా. ఓ కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటుందో అలా నటించాను. సినిమాలో సర్ప్రైజ్లు ఉంటాయి’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో నాది నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా అనేది తెరపై చూడాలి’ అన్నారు. భరత్ మాట్లాడుతూ…‘ప్రేమిస్తే, యువసేన చిత్రాల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.
మంచి థ్రిల్లర్ చిత్రమిది. మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ…‘ఆనందప్రసాద్ గారు ఇచ్చిన అవకాశం వల్లే ఈ సినిమా చేయగలిగా. రేపు విడుదలయ్యాక ఈ చిత్రానికి వచ్చే మంచి పేరంతా మా టీమ్‌కు దక్కుతుంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్, మ్యూజిక్ ఆకర్షణ అవుతాయి. ట్రైలర్ చూసి కథ ఊహించినా తెరపై మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నారు. నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ..‘ఇంగ్లీష్ టైటిల్‌తో వస్తున్న తెలుగు చిత్రమిది. శ్రీకాంత్, సుధీర్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ నెల 26న సినిమా చూస్తారని ఆశిస్తున్నా’ అ