గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హలో మీరా’. ఒకే ఒక పాత్రతో దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వంలో డా॥ లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హిరణ్మయి కల్యాణ్.