‘కోర్ట్’ సినిమా నన్ను గెలిపించింది
‘నేను ఈ రోజుదాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీమ్‌ని గెలిపించింది. ప్రేక్షకులు సినిమాను గెలిపించారు. ‘కోర్ట్' సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నాను. రానున్న రోజుల్లో ‘కోర్ట్' పేరు మారుమ్రోగుతుంది.
‘నేను ఈ రోజుదాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీమ్‌ని గెలిపించింది. ప్రేక్షకులు సినిమాను గెలిపించారు. ‘కోర్ట్’ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నాను. రానున్న రోజుల్లో ‘కోర్ట్’ పేరు మారుమ్రోగుతుంది. ఈ సినిమా విజయానికి కారకులైన అందరికీ పేరుపేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అని హీరో నాని అన్నారు. ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. దీప్తి గంటా సహ నిర్మాత. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో నాని మాట్లాడారు. ‘బలగం’ తర్వాత తనకు దొరికిన గొప్ప అవకాశం ‘కోర్ట్’ సినిమా అని హీరో ప్రియదర్శి అన్నారు. పాతికేళ్లుగా మంగపతి లాంటి పాత్రకోసం ఎదురుచూస్తున్నానని, నాని తెలుగు సినిమాకు మరో సూపర్‌స్టార్ కృష్ణ అని నటుడు శివాజీ కొనియాడారు. నాని ప్రొడక్ట్‌ని అని చెప్పుకోడానికి ఒక దర్శకునిగా గర్విస్తానని దర్శకుడు రామ్‌జగదీష్ అన్నారు. ఇంకా నటులు శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, రోషన్, నటి శ్రీదేవి, సహ నిర్మాత దీప్తి గంట, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

