మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జిన్నా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆయన గాలి నాగేశ్వరరావు అనే మాస్ క్యారెక్టర్‌ను చేస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘మంచు విష్ణు పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. గాలి నాగేశ్వరరావుగా ఆయన నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఆయన కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. పాయల్‌రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంభాషణలు: భాను, నందు, సంగీతం: అనూప్‌రూబెన్స్, మూల కథ: జి.నాగేశ్వర రెడ్డి.