The Great Indian Suicide | భయపెట్టేందుకు వస్తున్న హెబ్బా పటేల్.. ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
The Great Indian Suicide | కుమారి 21 ఎఫ్(Kumari 21 F) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తరువాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా(Ekkadiki Pothav Chinnavada), 24 కిస్సెస్, మిస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హెబ్బా పటేల్ ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది. విప్లవ్ కోనేటి (Viplav Koneti) దర్శకత్వంతో పాటు ఈ మూవీని సొంతంగా నిర్మిస్తున్నాడు.
The Great Indian Suicide | కుమారి 21 ఎఫ్(Kumari 21 F) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తరువాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా(Ekkadiki Pothav Chinnavada), 24 కిస్సెస్, మిస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హెబ్బా పటేల్ ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది. విప్లవ్ కోనేటి (Viplav Koneti) దర్శకత్వంతో పాటు ఈ మూవీని సొంతంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలను అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (The Great Indian Suicide) అనే పేరును ఖరారు చేయగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (AHA) వేదికగా ఈ సినిమా అక్టోబర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ”కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం” అంటూ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. దీంతో పాటు హెబ్బా పోస్టర్‌ను వదిలారు.
కళ్లను కప్పేసిన మూఢనమ్మకం..
నమ్మకంతో రాసుకున్న మరణశాసనం!😱#TheGreatIndianSuicide, A Cult Suicide story from 6th Oct, only on aha!@ItsActorNaresh #KSV @iramkarthik @ihebahp @Viplove_species @SricharanPakala @jk_dr @Syringe_Cinema pic.twitter.com/9n4LdgQJ5J— ahavideoin (@ahavideoIN) September 26, 2023
ఇదిలా ఉంటే ఈ సినిమా మదనపల్లి (Madanapalle)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆ కుటుంబం ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాలనుకుంది? పునర్జన్మలపై వారికి నమ్మకం ఉందా? చనిపోయిన వారు మళ్లీ పుడతారని ఆ కుటుంబం ఎందుకు నమ్మిందనే పాయింట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో హెబ్బాపటేల్‌తో పాటు రామ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నరేష్ వీకే, పవిత్రా లోకేష్ ఈ సినిమాలో భార్య భర్తలుగా కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

