‘రౌడీబాయ్స్’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్‌రాజు-శిరీష్ నిర్మాతలు. పస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుండి మే 1న కథానాయకుడు ఆశిష్ బర్త్‌డే సందర్భంగా ‘దిల్ఖుష్’ అనే తొలి లిరికల్ వీడియో పాటను విడుదల చేస్తున్నారు.
రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటకు మిక్కి.జే.మేయర్ స్వరాల్ని అందించారు. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ఆశిష్ మాస్‌లుక్‌లో బిందాస్ ఆటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పాత్రబస్తీ కుర్రాడిగా ఆశిష్ పాత్ర ఫుల్ మాసివ్‌గా వుండబోతుందని ఈ పోస్టర్లో ఆశిష్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇవనా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, కోప్రొడ్యూసర్స్: హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశోక్ బండ్రెడ్డి.