Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో విలన్‌గా లోకనాయకుడు..!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Project K | ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రభాస్‌కు ఆయన విలన్‌గా నటిస్తున్నారనే వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపుతున్నది. ‘విక్రమ్’ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. ఈ చిత్ర విజయంతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ నటిస్తున్నారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదే నిజమైతే..ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

