పొలిటికల్ డ్రామాగా శాసనసభ
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటిస్తున్న సినిమా ‘శాసనసభ’. సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటిస్తున్న సినిమా ‘శాసనసభ’. సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. వేణు మడికంటి దర్శకుడు. డిసెంబర్ 16న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కథ, మాటల రచయిత రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…‘ఇంద్రసేన ప్రతిభకు తగిన విజయం ఇప్పటిదాకా రాలేదు. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ఆ లోటు తీరుస్తుంది.
రాజకీయ నేపథ్యంతో వ్యంగ్యంగా కథ సాగినా ఎవరినీ నొప్పించేలా ఉండదు’ అన్నారు. దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ…‘ఆకట్టుకునే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాము. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు. ఈ చిత్రంతో ఇంద్రసేన యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. ద్వితీయార్థంలో వచ్చే శాసనసభ సన్నివేశాలు వాస్తవ రాజకీయ పరిస్థితులను చూపిస్తాయి. రవి బస్రూర్ సంగీతం ఆకర్షణ అవుతుంది’ అన్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ..“కేజీఎఫ్’ లాగే శాసనసభ కూడా సంగీత పరంగా మిమ్మల్ని అలరిస్తుంది.
సంగీతానికి చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు’ అన్నారు. నిర్మాత తులసీరామ్ సాప్పని మాట్లాడుతూ..‘సరికొత్త కథ, కథనాలతో వస్తున్న మా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు. నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ…‘ఓ మంచి కథ కోసం వెతుకుతున్న సమయంలో శాసనసభ స్క్రిప్ట్ దొరికింది. మంచి కథలే విజయాలు సాధిస్తున్న రోజులివి. మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. అందుకే ఇంత భారీగా ఖర్చు పెట్టి సినిమా చేశాం. ఈ చిత్రానికి మొదటి హీరో ఇంద్రసేన అయితే రెండో హీరో సంగీత దర్శకుడు రవి బస్రూర్’ అన్నారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ…‘రాజకీయ నేపథ్యంతో చేసిన సినిమా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు చేరువయ్యే సినిమా ఇది. ఈ సినిమాతో నా స్నేహితుడు ఇంద్రసేనకు మంచి విజయం దక్కాలి’ అన్నారు. రోజా మాట్లాడుతూ…‘ట్రైలర్ చాలా బాగుంది. ఏ ప్రాంతం ప్రేక్షకులకైనా సినిమా నచ్చేలా ఉంది. విభిన్నమైన చిత్రంగా ఓ మంచి ప్రయత్నం చేశారు. ఈ టీమ్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

