The Family Man 3 | ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.!
The Family Man S3 | ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి.
The Family Man S3 | ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు నమోదు చేసింది. స్పై, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి సీజన్ 3 రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్.
పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జైదీప్ అహ్లావత్(Jaideep Ahlawat) ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. జైదీప్ ఈ ప్రాజెక్ట్ కోసం 2 ఏండ్ల ముందు నుంచే ఇందులో జాయిన్ అయ్యాడు. కానీ ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇందులో ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. సీజన్ 3 విషయానికి వస్తే.. నవంబర్ (The Family Man 3 November release)లో ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుందంటూ మనోజ్ చెప్పుకోచ్చాడు.
ఫస్ట్ సీజన్ టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. సెకండ్ సీజన్ శ్రీలంక రెబల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి హిట్ అందుకుంది. ఇక సెకండ్ సీజన్లో సమంత లీడ్ రోల్లో నటించడం విశేషం. అయితే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. సీజన్ 3 ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు ప్రకటించింది. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను శ్రీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సీజన్ 3 వచ్చేవరకు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

