రియల్‌లైఫ్ సంఘటనలు స్ఫూర్తి
రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు, వాటి పరిస్థితులు ‘నేను స్టూడెంట్ సర్' చిత్రంలో ఎక్కువగా వుంటాయి. చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ గణేష్.
రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు, వాటి పరిస్థితులు ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రంలో ఎక్కువగా వుంటాయి. చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ గణేష్. ‘స్వాతిముత్యం’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన గణేష్ నటించిన రెండో చిత్రమిది. సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ గణేష్ బుధవారం పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కృష్ణ చైతన్య అందించిన ఓ ఆసక్తికరమైన న్యూ ఏజ్ థ్రిల్లర్‌తో నా రెండో సినిమా తెరకెక్కడం ఆనందంగా వుంది. ఈ కథ వినగానే ఇందులో వున్న ఎమోషన్, క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యాను. ‘స్వాతిముత్యం’లో నా పాత్ర మొదటి నుండి చివరి వరకు అమాయకంగానే వుంటుంది. ఈ చిత్రంలో మాత్రం డిఫరెంట్ షేడ్స్ వున్నాయి. హ్యాపీగా మొదలై మధ్యలోకి వచ్చేసరికి బాధ, టెన్షన్ ఉంటూ చివర్లో ఎదురుతిరిగి తనకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఎంతో ఎంగేజింగ్‌గా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం, ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుంది.
‘స్వాతిముత్యం’ సినిమా విడుదల సమయంలో చిరంజీవి, నాగార్జున లాంటి పెద్ద స్టార్స్ సినిమాలు కూడా విడుదల వుండటంతో అప్పుడు రిలీజ్ డేట్ కరెక్ట్ కాదని అందరూ అన్నారు. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్’కు విడుదల తేది అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. ఈ చిత్ర విజయంపై నాకు గట్టి నమ్మకం వుంది. తప్పకుండా ఈ చిత్రం నన్ను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

