Vamshi Paidipally | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు పట్టాలెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం (SVC63) రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో నటించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పాన్-ఇండియా చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నెలనుంచే షూటింగ్ మొదలవుతుందని గతంలోనే ప్రకటించిన చిత్ర బృందం, ఈరోజు నుంచి కెమెరా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించింది. యాక్షన్ మరియు ఎమోషన్స్ కలయికగా రానున్న ఈ చిత్రం 2027 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
#SALMANKHANVAMSHIPAIDIPALLYFILM… IT ALL BEGINS TODAY.. ❤️🔥#Nayanthara #SVC63 @SVC_official pic.twitter.com/Ei1NVTnQb6
— Vamshi Paidipally (@directorvamshi) April 18, 2026