Oppenheimer | వివాదంలో ‘ఓపెన్ హైమర్’.. ఆ సన్నివేశాన్ని తొలగించాలంటూ చిత్ర దర్శకుడికి సమాచార శాఖ కమిషనర్ లేఖ
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోపిక్ చిత్రం ‘ఓపెన్ హైమర్' ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. తొలి అణు బాంబు రూపకర్త అయిన అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
Oppenheimer | ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోపిక్ చిత్రం ‘ఓపెన్ హైమర్’ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. తొలి అణు బాంబు రూపకర్త అయిన అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇండియాలో కూడా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నది. తనదైన శైలి మేకింగ్‌తో దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం అందరిని ఆకట్టుకుంటున్నది. అయితే ఈ సినిమాలోని ఓ శృంగార సన్నివేశంలో భగవద్గీత పుస్తకాన్ని చూపిస్తూ అందులోని సంస్కృత శ్లోకాలను చెప్పడం వివాదాస్పదంగా మారింది.
సోషల్‌మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ‘రెస్పెక్ట్ హిందూ కల్చర్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాన్ని భారత్‌లో ఎలా అనుమతిచ్చారో వివరణ ఇవ్వాల్సిందిగా సెన్సార్ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై భారత సమాచార శాఖ కమీషనర్ ఉదయ్ మహూర్కర్ చిత్ర దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్‌కు ఓ లేఖ రాశారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించాలని ఆయన ఆ లేఖలో కోరారు. సినిమాలోని ఆ దృశ్యాన్ని హిందూ సంస్కృతిపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించడానికి దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్ సుముఖంగా ఉన్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

