ఆ క్రెడిట్ ప్రభాస్‌కే సొంతం
అలుపులేకుండా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులకు అంతులేనంత సంతోషాన్నిస్తున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్.
అలుపులేకుండా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులకు అంతులేనంత సంతోషాన్నిస్తున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. 24ఏండ్ల క్రితం ‘ఈశ్వర్’తో మొదలైన ఆయన సినీ ప్రయాణం దేశం గర్వపడే బాక్సాఫీస్ రికార్డులతో అప్రతిహతంగా సాగుతున్నది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మాను ఇష్టపడేవారు నార్త్‌లో కోకొల్లలు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్థానిక స్టార్ హీరోల సినిమాలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడుతున్నాయి. దీన్నిబట్టి హీరోగా ఆయన ఇమేజ్ ఈ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ నటించిన బాహుబలి-ది కంక్లూజన్, కల్కి 2898ఏడీ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. వెయ్యికోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన రెండు సినిమాలున్న ఏకైక దక్షిణాది హీరో ప్రభాస్ మాత్రమే. ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా ఎల్లలు దాటి, గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీటిలో ‘ఫౌజీ’ వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్నట్టు వినికిడి. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ఆయన అభిమానులకు నిజంగా ఇది పండుగ రోజే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

