GaayaPadda Simham | తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్..!
GaayaPadda Simham | రీసెంట్గా తరుణ్ భాస్కర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం (GaayaPadda Simham) సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ కలయికతో ‘ట్రైజర్’ను తాజాగా విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది.
GaayaPadda Simham | టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం (GaayaPadda Simham) ’Don’t Laugh… It’s a Serious Matter. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ కలయికతో ‘ట్రైజర్’ను తాజాగా విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది.
టైజర్ సైటైరికల్ కామెడీ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎలిమెంట్స్ తో కలయికతో ఫన్‌గా సాగుతూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుందని టైజర్తో హింట్ ఇచ్చాడు. ఆ యువకుడు వీసా రిజెక్ట్ కావడంతో అతడు ఎదుర్కొనే నిరాశ, ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు కథకు ప్రధానాంశాలుగా ఉంటాయని ట్రైజర్ హింట్ ఇచ్చేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, కేజీఎఫ్ స్పూఫ్ సన్నివేశాలు, అమెరికా వెళ్లకపోయినా హీరో ఇచ్చే బిల్డప్ డైలాగులు వినోదాన్ని పంచుతున్నాయి.
ప్రత్యేకంగా ట్రైజర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సూచించే విధంగా చూపించిన సన్నివేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమెరికా వీసా నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత ఆవేదనను ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుద తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రాంచరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజైన మరుసటి రోజే అన్నమాట.
దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీలో విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీస్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ అయింది 🦁#GaayaPaddaSimham Landing in THEATERS WORLDWIDE FROM MAY 1st, 2026 💥💥
Get ready for all the FUN, MADNESS & ABSOLUTE ENTERTAINMENT ❤️🔥#GPS #GPSfromMay1st#TharunBhascker @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @IamVishnuOi… pic.twitter.com/mtwiYRq6GJ
— BA Raju’s Team (@baraju_SuperHit) March 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

