Sita Ramam Movie | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం ‘సీతారామం’. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని రుజువు చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈ సినిమాకు విశేష ఆధరణ వస్తుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకొని లాభాల బాట పట్టింది. ఇటీవలే 50కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీతో దుల్కర్‌కు టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పడింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణాష్టమి సందర్బంగా ఈ చిత్రంలోని ‘తరలి తరలి’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మృనాళ్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల చూపును తిప్పుకోనికుండా చేస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కీలక పాత్ర పోషించింది. నటుడు సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు.