టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya)నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి థ్యాంక్యూ (Thank You). మనం ఫేం విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీఖన్నా (Raashi Khanna) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ నాగచైతన్య లుక్ ఒకటి రిలీజ్ చేయగా..నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా అందించారు. థ్యాంక్యూ టీజర్ (Thank You Teaser)ను మే 25న సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్వీట్ చేశారు.
చైతూ హ్యాపీ మూడ్‌లో ఉన్న పోస్టర్‌తో టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు. అంతేకాదు చైతూ డబ్బింగ్ చెబుతుండగా డైరెక్టర్ తీసిన వీడియోను షేర్ చేస్తూ అప్ డేట్ ఇచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా బీవీఎస్ రవి కథనందించాడు. లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ థ్యాంక్యూ సినిమాకు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జులై 8న విడుదల కాబోతుంది.
The journey of Thank You begins with #ThankYouTeaser
May 25th at 5:04 pm 🤩https://t.co/LOwOESqTjD@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouTheMovie pic.twitter.com/gDUEljy6Fj— Maduri Mattaiah (@madurimadhu1) May 23, 2022